సైరాలో అమితాబ్‌ పాత్ర ఏంటో తెలుసా?

amitab-bachhan-playing-guru-role-in-chiranjeevi-saira-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఖరారు అయ్యింది. బాలకృష్ణ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ అనే చిత్రం కోసం అమితాబచ్చన్‌ను సంప్రదించడం జరిగింది. కాని అందుకు ఆయన నో చెప్పాడు. బాలయ్యకు నో చెప్పిన బిగ్‌బి ఇప్పుడు చిరంజీవికి ఓకే చెప్పడంపై కాస్త అసహనం వ్యక్తం అవుతుంది. బాలయ్యకు ఎందుకు నో చెప్పాడా అని కొందరు చర్చించుకుంటున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అమితాబ్‌ పాత్ర ఏంటి, ఎలా కనిపించబోతున్నాడు. అంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర కనుక బిగ్‌బి ఒప్పుకున్నాడా అంటూ సోషల్‌ మీడియాలో భారీగా చర్చ జరుగుతుంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బి పోషించబోతున్న పాత్ర ఏంటో తేలిపోయింది.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. బ్రిటీష్‌ వారితో పోరాడటంలో ఉయ్యాలవాడకు ఆయన గురువు కీలక సాయం చేశారు. యుద్ద విద్యలు నేర్పడంతో పాటు, యుద్ద సన్నాహాలకు కూడా ప్రణాళికలు ఎలా వేయాలని గురువు నుండి ఉయ్యాలవాడ నేర్చుకోవడం జరిగింది. ఆ విషయం ఉయ్యాలవాడ జీవిత చరిత్రలో ఉండబోతుంది. ఉయ్యాలవాడకు గురువు అంటే చాలా గొప్ప నటుడు అవ్వాలని మొదటి నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. వారు కోరుకున్నట్లుగానే బిగ్‌బి ఈ పాత్రకు ఓకే చెప్పడంతో సినిమా స్థాయి మరింతగా పెరిగింది. చిరంజీవి, అమితాబ్‌ల కాంబో సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. అమితాబ్‌ కనిపించేది కొద్ది సమయమే అయినా సినిమాకు అవి కీలక సన్నివేశాలుగా ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు:

లవ టీజర్ లో మెరిసిన ఎన్టీఆర్…

చిన్నారుల‌కు ప్రేమ‌`తో నేర్పిద్దాం…కోపంతో కాదు