బిగ్‌బాస్‌ ఇంటికి మహేష్‌బాబు..!

Mahesh Babu Entry Into Bigg Boss Show For Spyder Movie Promotion

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న ‘బిగ్‌బాస్‌’ షోకు భారీ రెస్పాన్స్‌ వస్తోంది. రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ ఈ షోకు వస్తున్న నేపథ్యంలో పెద్ద సినిమాలను ఈ షో ద్వారా ప్రమోట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రానా హీరోగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ప్రమోషన్‌ కోసం రానా బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ‘ఆనందోబ్రహ్మా’ చిత్రం కోసం ముద్దుగుమ్మ తాప్సి బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లింది. ఇప్పుడు ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం ప్రమోషన్‌ కోసం విజయ్‌ దేవరకొండ కూడా బిగ్‌బాస్‌ ఇంట్లో సందడి చేయడం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబు కూడా బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

వచ్చే నెలలో దసరా సందర్బంగా ‘స్పైడర్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మహేష్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్‌ చేస్తుంది. సినిమాకు భారీగా ప్రమోషన్‌ చేయాలనే ఉద్దేశ్యంతో పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ‘బిగ్‌బాస్‌’ షోకు వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే మహేష్‌బాబు ‘బిగ్‌బాస్‌’ షోకు వెళ్లనున్న విషయమై షో నిర్వాహకులకు తెలియజేయడం జరిగింది. సినిమా విడుదలకు ముందు వారంలోనే మహేష్‌బాబు బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లనున్నాడు. మొత్తానికి మహేష్‌బాబు కూడా బిగ్‌బాస్‌ ఇంట్లో సందడి చేయనున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు:

ఎన్టీఆర్‌తో సినిమా.. నందిని రెడ్డి గొంతెమ్మ కోర్కె

బిగ్‌బాస్‌లో అర్జున్‌ రెడ్డి