ఎన్టీఆర్‌తో సినిమా.. నందిని రెడ్డి గొంతెమ్మ కోర్కె

Director Nandini Reddy Wants To Make A Film With Jr NTR

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

‘అలా మొదలైంది’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకురాలు నందిని రెడ్డి ఆ తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ ముందు నిలువలేక పోయాయి. ఆమెపై ఇప్పుడు ఏ హీరో కూడా నమ్మకంను పెట్టలేక పోతున్నాడు. ఆమెతో సినిమాలు చేసేందుకు ఏ హీరో ముందుకు రాకపోవడంతో ఆమెకు సినిమాలు లేక ఖాళీగా ఉంది. తాజాగా నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూ సందర్బంగా తన వద్ద మంచి కథలున్నాయి, అయితే మంచి హీరో కోసం వెదుకుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తనకు ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే కోరిక చాలా కాలంగా ఉందని, ఒక మంచి కథతో ఆయన్ను తప్పకుండా ఒప్పించి ఆయనతో సినిమా చేస్తాను అంటూ ధీమా వ్యక్తం చేసింది.

సీనియర్‌ ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల కలయికలో వచ్చి తెలుగు సినిమా ఆణిముత్యంగా నిలిచి పోయిన ‘గుండమ్మ కథ’ చిత్రాన్ని ఎన్టీఆర్‌తో రీమేక్‌ చేయాలనే కోరిక కూడా తనకు ఉంది అంటూ నందిని రెడ్డి చెప్పుకొచ్చింది. ఎంతో మంది స్టార్‌ దర్శకులు మరియు ప్రముఖ నిర్మాతలు కూడా ఆ సినిమాను ఎన్టీఆర్‌తో చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాని ఎన్టీఆర్‌కు మాత్రం పెద్దగా ఆ రీమేక్‌పై ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో నందిని రెడ్డికి కనీసం కథ చెప్పే అవకాశం అయిన ఎన్టీఆర్‌ ఇస్తాడు అనుకోలేం. అందుకే నందిని రెడ్డి కోరికను గొంతెమ్మ కోరిక అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరిన్ని వార్తలు:

వివేకం… తెలుగు బులెట్ రివ్యూ.

జక్కన్న తర్వాత సినిమా దాదాపు ఖాయం