నంద్యాలలో పేలిన తూటా… శిల్పా సేఫ్.

bhuma supporter abhiruchi madhu gun firing on shilpa chakrapani reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నంద్యాల ఉప ఎన్నికల పర్వం అయిపోయినా ఆ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఈ రోజు నంద్యాలలో తుపాకులు పేలాయి. శిల్పా చక్రపాణిరెడ్డి లక్ష్యంగా ఈ కాల్పులు జరిగినట్టు వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఆయన సేఫ్ గానే వున్నారు. భూమా బ్రహ్మానంద రెడ్డి వర్గానికి చెందిన అభిరుచి మధు ఈ కాల్పులు జరిగినట్టు వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే మధు మాత్రం తనపై జరుగుతున్న దాడిని ఆపడానికి గాలిలోకి కాల్పులు జరిపినట్టు చెబుతున్నాడు.

నంద్యాల లో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వచ్చిన సందర్భంగా భూమా, శిల్పా వర్గాల మధ్య చిచ్చు రేగింది. అక్కడ వున్న శిల్పా చక్రపాణిరెడ్డి, అభిరుచి మధు కూడా అందులో భాగం అయ్యారు. తొలుత వాగ్వాదంగా మొదలైన గొడవ, ఘర్షణ కాల్పుల దాకా దారి తీసింది. అయితే ఆ కాల్పులు శిల్పా చక్రపాణిరెడ్డి మీద జరిగాయా లేక గాలిలోకా అన్నది పోలీసులు తేల్చాల్సి వుంది.

మరిన్ని వార్తలు:

ప్రభువును మించిన ప్రభు డ్రామా

రెండాకుల కలయికపై దినకరన్ ఆక్రోశం

లింక్డిన్ లిస్ట్ లోనూ మోడీకి చోటు