రెండాకుల కలయికపై దినకరన్ ఆక్రోశం

TTV Dinakaran Compare To MK Stalin

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

తాను చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది టీటీవీ దినకరన్ పరిస్థితి. తమిళనాడు రాజకీయాల్లో తమ కుటుంబానికి స్థానం లేకుండా ఈపీఎస్, ఓపీఎస్ ఆడిన పవర్ గేమ్ చూసి ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. కానీ దింపుడు కళ్లెం ఆశతో ఆయన తొండాట మొదలుపెట్టారు. అసలు వీరిద్దరి కలయికకి కార్యకర్తల ఆమోదం లేదని కొత్త వాదన తీసుకొచ్చారు.

ఇప్పటికే ఈపీఎస్ కు మద్దతు ఉపసంహరించుకున్నట్లు 19 మంది ఎమ్మెల్యేలతో లేఖ ఇప్పించిన దినకరన్.. ఫ్యూచర్ ప్లాన్ పై స్పష్టత లేకుండా ముందుకెళ్తున్నారు. స్టాలిన్ తో కలిసి అధికారంలోకి రావచ్చని కలలు కంటున్నారు. కానీ సీఎం పదవి దినకరన్ కు ఎలా వస్తుందని అన్నాడీఎంకే కార్యకర్తలు వేస్తున్న ప్రశ్నలకు మాత్రం ఆయన దగ్గర ఆన్సర్ లేదు.

గతంలో ఓపీఎస్ తిరుగుబాటు సమయంలో ఆయనపై ప్రజాభిమానం ఉప్పొంగింది. అందుకే స్టాలిన్ ముందుకొచ్చి సహకరించారు. అప్పుడు స్టాలిన్ గెలిచినా.. ఓపీఎస్ ను సీఎం చేయక తప్పని పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా వేరు. దినకరన్ కు క్యాడర్లోనే కాదు జనంలో కూడా మంచి ఉద్దేశం లేదు. మధురై సభకు ఎమ్మెల్యేలు జనాన్ని తరలించారు. కానీ అమ్మ సర్కారును పడగొడతామంటే వీళ్లంతా అసెంబ్లీకి వస్తారా అనేది సందేహమే.

మరిన్ని వార్తలు:

ఆ సెక్స్‌ రాకెట్‌తో ఇద్దరు సినీ ప్రముఖులకు సంబంధం!

చిన్నారుల‌కు ప్రేమ‌తో నేర్పిద్దాం…కోపంతో కాదు