ప్రభువును మించిన ప్రభు డ్రామా

Suresh Prabhu wants to resign train accident in uttar pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొన్ని విషయాల్లో ప్రధాని మోడీ చాలా డ్రామాలాడతారు. ఏం తెలియదంటూనే… చేయాల్సిందంతా చేసేస్తారు బీహార్, తమిళనాడులో జరిగింది అదే. ఇప్పుడు ఏపీలో జరగబోయేది కూడా అదే అని టీడీపీ నేతలు కసిగా మాట్లాడుతున్నారు. యథా రాజా… తథా ప్రజా అన్నట్లుగా మోడీ క్యాబినెట్ కూడా ఆయన బాటలోనే నడుస్తోంది. ప్రధానిని మించి డ్రామా పండిస్తున్నారు మంత్రులు.

నాలుగు రోజుల వ్యవధిలో కీలక రాష్ట్రం యూపీలో రెండు రైలు ప్రమాదాలు జరిగాయి. మొదటి ప్రమాదానికి సిబ్బందిదే బాధ్యత అని తెలిశాక కూడా అధికారులు నిద్ర లేవలేదు. దీంతో స్పందించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డారు. కానీ మోడీ మాత్రం వారించారట. ఈ సంగతి ప్రభు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది పబ్లిసిటీ జిమ్మిక్కని సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిసింది.

నిజంగా రాజీనామా చేసేవాళ్లు ఆఫర్ చేయరని, ఆమోదించక తప్పని పరిస్థితి కల్పిస్తారని తేల్చిచెప్పారు నెటిజన్లు. సురేష్ ప్రభు ఇప్పటికైనా ట్విట్టర్ ప్రపంచాన్ని వదిలి వాస్తవ ప్రపంచంలోకి రావాలని, ఇంటర్నెట్లో చూసిందే నిజమనుకుంటే ఇలాగే ఉంటుందని దెప్పిపొడిచారు. దీంతో సురేష్ ప్రభు ట్విట్టర్ జీవితంలో తొలిసారి షాక్ తగిలినట్లైంది.

మరిన్ని వార్తలు:

ఏపీలో ముచ్చటగా మూడో ఎన్నిక

అమెరికా వ‌దిలి నీ దేశం వెళ్లిపో..