జక్కన్న తర్వాత సినిమా దాదాపు ఖాయం

Rajamouli Next Movie To Do With Mega Hero

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వంలో హిందీ స్టార్‌ హీరోలు సైతం నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాని రాజమౌళి మాత్రం తెలుగులోనే తన తర్వాత సినిమా ఉండబోతుందని ఇప్పటికే ప్రకటించాడు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో రాజమౌళి తర్వాత సినిమా ఉంటుందనే విషయం తెల్సిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో చేసే అదృష్టం ఎవరికి దక్కుతుందో అని గత రెండు మూడు నెలలుగా సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. 

ఎట్టకేలకు రాజమౌళి తర్వాత సినిమా ఎవరు హీరోగా ఉండబోతుందో కాస్త క్లారిటీ వచ్చింది. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోతో రాజమౌళి సినిమా ఉంటుందని దాదాపుగా ఖరారు అయ్యింది. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. అల్లు అర్జున్‌ లేదా రామ్‌ చరణ్‌లతో రాజమౌళి సినిమా ఉండే అవకాశాలున్నాయి. వారిద్దరు కాకుంటే సాయి ధరమ్‌ తేజ్‌ లేదా వరుణ్‌ తేజ్‌తో అయినా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా అల్లు అర్జున్‌తో జక్కన్న సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి రాజమౌళి ఆ మెగా అవకాశాన్ని ఏ మెగా హీరోకు ఇస్తాడో చూడాలి. నిర్మాత దానయ్య ఇప్పటికే ఆ మెగా హీరో డేట్లు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు నెలల్లో అధికారిక ప్రకటన వచ్చి నవంబర్‌ లేదా డిసెంబర్‌లో సినిమా ప్రారంభోత్సవం ఉండబోతుంది.

మరిన్ని వార్తలు:

వెనక్కు తగ్గిన అర్జున్‌రెడ్డి

బాలీవుడ్ హీరోల‌తో పోటాపోటీగా ప్ర‌భాస్‌

ఆ చిన్నారి తోషి మేన‌కోడ‌లు