బాలీవుడ్ హీరోల‌తో పోటాపోటీగా ప్ర‌భాస్‌

prabhas-compered-with-bollywood-heroes-in-favorite-heroes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాహుబ‌లి సంచ‌ల‌నాలు కొన‌సాగుతున్నాయి. ఈ సినిమాతో జాతీయ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్నాడంటూ ప్ర‌భాస్ పై వ‌స్తున్న వార్త‌లు నిజ‌మే అని తేలింది. ఇండియా టుడే నిర్వ‌హించిన మూడ్ ఆఫ్ ది నేష‌న్ 2016-17 సర్వేలో ప్ర‌భాస్ ఫేవ‌రెట్ హీరోల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. ప్ర‌భాస్ 7శాతం ఓట్ల‌తో ఈ జాబితాలో ఐదోస్థానంలో నిలిచాడు.

ఈ స‌ర్వేలో ఓ టాలీవుడ్ హీరోకి స్థానం ల‌భించ‌టం ఇదే తొలిసారి. ఈ స‌ర్వేలో ప్ర‌భాస్ బాలీవుడ్ ఖాన్ త్ర‌యాల్లో ఒక‌రైన అమీర్ ఖాన్ ను సైతం వెన‌క్కి నెట్ట‌డం విశేషం. బాహుబ‌లి 1, 2 త‌ర్వాత ప్ర‌భాస్ కు విప‌రీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఓ జాతీయ‌ స‌ర్వేలో ఐదో స్థానంలో నిలిచాడంటే ప్ర‌భాస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక ఫేవ‌రెట్ సినిమాల విష‌యానికొస్తే….బాహుబ‌లి 2…బాలీవుడ్ సినిమాల‌ను త‌ల‌ద‌న్ని మ‌రీ మొద‌టిస్థానంలో నిలిచింది. 26 శాతం ఓట్ల‌తో బాహుబ‌లి తొలిస్థానాన్ని ద‌క్కించుకుంది. బాలీవుడ ఎవ‌ర్ గ్రీన్ హిట్ షోలే కూడా బాహుబ‌లి 2తో పోలిస్తే వెన‌క‌ప‌డింది.

షోలే ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. మ‌ళ్లీ మూడో స్థానంలో బాహుబ‌లి 1 నిలిచింది. హీరోల జాబితాలో వెన‌క‌ప‌డినా… అమీర్ ఖాన్ దంగ‌ల్ కు సినిమా జాబితాలో మాత్రం నాలుగో స్థానం ద‌క్కింది. హీరోల విష‌యానికొస్తే…11శాతం ఓట్ల‌తో అమితాబ్ బ‌చ్చ‌న్ మొద‌టిస్థానంలో, స‌ల్మాన్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ బాద్ షా 8 శాతం ఓట్ల‌తో మూడో స్థానంలో , అక్ష‌య్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచారు. అటు హాలీవుడ్ కు వెళ్లిపోయినా ప్రియాంక చోప్రాకు భార‌త్ లో క్రేజ్ త‌గ్గ‌లేదు. ఫేవ‌రెట్ హీరోయిన్ జాబితాలో ఆమె ముందువ‌రుస‌లో ఉంది. దీపిక ప‌దుకునే, ఐశ్వ‌ర్యారాయ్‌, అనుష్క శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్ త‌రువాతి స్థానాల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు:

ఆ చిన్నారి తోషి మేన‌కోడ‌లు

మెగా ఫ్యాన్స్‌ కోపం అంతా పోయింది

స‌మంత త‌ర్వాత అను ఇమ్మానుయేల్‌