సైరాలో అమితాబ్ లుక్..మోషన్ టీజర్…!

Amitabh Bachchan Is Gosayi Venkanna In Sye Raa Narasimha Reddy

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత‍్మకంగా తెరకెక్కుతున్న స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర చిత్రం సైరా. ఈ చిత్రంలో అన్ని బాషలకు చెందిన పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఇదే సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

syeeraa-narashima

చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించిన ఫోటోల‌ని వారి బ‌ర్త్‌డే సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్న టీం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌ల చేసింది. గ‌తంలోనే సెట్‌లో చిరు, న‌య‌న‌తార‌తో క‌లిసి ఉన్న ఫోటోని అమితాబ్ షేర్ చేయ‌గా ఇప్పుడు అఫీషియ‌ల్‌గా అమితాబ్ ఫ‌స్ట్ లుక్ విడుదలైంది. రాజ‌గురువు గోస‌యి వెంక‌న్న‌ పాత్ర‌లో అమితాబ్ క‌నిపించనున్నట్టు తెలుస్తుంది.

syee-raaa-cheranjeevi

ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. విజ‌య్ సేతుప‌తి, సుదీప్ , జ‌గ‌ప‌తి బాబు, న‌య‌న‌తార త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ లో ఉన్న ఈ టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. దాని మీద మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.

syee-chiru