ఏపీ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే !

Andhra Pradesh Board Intermediate exams results dates

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి గత నెలలో నిర్వహించిన ఇంటర్‌ పరీక్ష ఫలితాల ఎప్పుడు విడుదల అవుతాయా అన్న ఉత్కంట అటు విద్యార్ధుల లోను వారి తల్లిదండ్రులలోను నెలకొని ఉంది. అయితే ఇంటర్‌ పరీక్ష ఫలితాకి సంబంధించి ఈరోజు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వచ్చింది. పరీక్షా ఫలితాల విషయంపై విజయవాడలో పరీక్షల నియంత్రణ అధికారి రమేశ్ ఈ రోజు ప్రకటన విడుదల చేశారు.

ప్రయోగ, థియరీ, జనరల్, ఒకేషనల్ కోర్సులకు నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను రాజమహేంద్ర వరం నుంచి ఈ నెల 12న మధ్యాహ్నం విడుదల చేస్తామని, అలాగే, మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలను విశాఖపట్నం నుంచి ఈ నెల 13 మధ్యాహ్నం విడుదల చేస్తామని తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి బీ ఉదయలక్ష్మి సంయుక్తంగా విడుదల చేస్తారని సమాచారం.

ఇంటర్ విద్యార్ధులు ఫలితాలని మా తెలుగు బులెట్ వెబ్ సైట్ నుండి పొందవచ్చు