‘రంగస్థలం’ సక్సెస్‌ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా..!

Mega Family at rangasthalam movie Success Ceremony

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం భారీ విజయం సాధించింది. 100 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ను దక్కించుకుని టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా నిలిచింది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ చిత్రంకు భారీ ఎత్తున విజయోత్సవ వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లో ఈ వేడుక నిర్వహించతలపెట్టారు. సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను వైజాగ్‌లో నిర్వహించగా, ఈ వేడుకను హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. ఈ వేడుకలో ఇప్పటికే పవన్‌ హాజరు అవ్వడం ఖాయం అని తేలిపోయింది. తాను విజయోత్సవ సభలో మాట్లాడుతాను అంటూ పవన్‌ చెప్పడంతో ఆయన హాజరు ఖరారు అయ్యింది.

ఇక మెగా ఫ్యామిలీ నుండి ఎవరు ఎవరు రాబోతున్నారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ఖచ్చితంగా హాజరు అవ్వడం ఖాయం. మెగా బ్రదర్స్‌తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు అంతా కూడా హాజరు అవ్వనున్నట్లుగా మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఈ వేడుకలో పాల్గొంటాడా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆయన కూడా వేడుకలో పాల్గొంటాడని, మెగా ఫ్యామిలీ నుండి చిన్నా చితకా అనే తేడా లేకుండా అందరు హీరోలు కూడా వచ్చే వారంలో జరుగబోతున్న భారీ విజయోత్సవ సభలో పాల్గొనబోతున్నారు. మెగా హీరోల సత్తాను రంగస్థలం చూపించిందని నిరూపించేందుకు మెగా హీరోలు అంతా కూడా వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ వేదికపై నుండి మెగా ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా ఉన్నాం అని చెప్పనున్నట్లుగా తెలుస్తోంది.