కండోమ్‌ వల్ల మెగా ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది!!

Kavya Thapar Misses Chance in Varun Tej Movie Because of Condom Ad

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో సంకల్ప్‌ రెడ్డి ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తన మొదటి సినిమాను సబ్‌ మెరైన్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి రెండవ సినిమాను అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కించేందుకు ఒక పక్కా స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. పూర్తి స్థాయి ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా ఇద్దరు నటించబోతున్నారు. తాజాగా ఈ చిత్రంలో నటించబోతున్న హీరోయిన్స్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. వరుణ్‌కు జోడీగా అదితి రావు, లావణ్య త్రిపాఠిను ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. అయితే లావణ్య త్రిపాఠికి ముందు బాలీవుడ్‌ బ్యూటీ కావ్యను ఎంపిక చేయడం జరిగింది.

ఇటీవల కావ్య ఒక కండోమ్‌ యాడ్‌లో నటించి సంచలనం సృష్టించింది. అందాలతో ఆకట్టుకున్న కావ్య కొన్ని విమర్శలను కూడా మూటకట్టుకుంది. ఇలాంటి గ్లామర్‌ ముద్దుగుమ్మ తమ సినిమాకు సెట్‌ అవ్వదనే ఉద్దేశ్యంతో దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి ఈ చిత్రం నుండి కావ్యను తప్పించినట్లుగా తెలుస్తోంది. కండోమ్‌ యాడ్‌లో నటించడం వల్ల ఈ అమ్మడు అవకాశం కోల్పోయింది. ఆమెకు ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా వదిలేసి చిత్ర నిర్మాతలు లావణ్య త్రిపాఠికి అడ్వాన్స్‌ ఇచ్చినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. సినిమాను లాంచనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అవ్వడంతో అందరికి ఈ సినిమాపై ఆసక్తి ఉంది.