మహేష్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన అనీల్ రావిపూడి.!

మహేష్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన అనీల్ రావిపూడి.!
Movie News

మన టాలీవుడ్ లో ప్రెజెంట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో ఇపుడు దసరా కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా “భగవంత్ కేసరి” దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఒకరు. మరి అనీల్ నుంచి రానున్న ఈ చిత్రం కూడా మినిమమ్ గ్యారెంటీ రిపోర్ట్స్ తో వినిపిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

మహేష్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన అనీల్ రావిపూడి.!
Anil Ravipoodi, Mahesh Babu

ఇది వరకే ఈ కాంబినేషన్ లో వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం సెన్సేషనల్ హిట్ అందుకోగా మళ్ళీ ఆ తర్వాత వీరి నుంచి మరో సినిమా అంటూ రీసెంట్ గానే ఒక బజ్ వైరల్ గా మారింది. అయితే ఈ రూమర్స్ పై అనీల్ క్లారిటీ ఇచ్చాడు. తనకి మహేష్ గారికి తో మరో సినిమా చేసేలా ఎంతో సాన్నిహిత్యం ఉందని .. కానీ మహేష్ గారి 29వ సినిమా తాను చేస్తున్నట్టుగా వచ్చిన వార్తలు అన్నీ అబద్దం అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీనితో అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై గత కొన్ని రోజులు కితం వచ్చిన వార్తలు ఫేక్ అని తేలిపోయింది.