అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ తో విశాల్ పెళ్లి !

ప్రముఖ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఆయన తండ్రి జీకే రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అనీషాతో విశాల్ వివాహం జరగబోతోందని ఆయన ప్రకటించారని వార్తలు వచ్చాయి. అయితే మళ్ళీ విశాల్ ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపిస్తోందని క్లాస్ పీకడంతో సైలెంట్ అయ్యింది. అయితే తాజాగా ఈ విషయం మీద క్లారితీ వచ్చేసింది. విశాల్ కు కాబోయే భార్య ఎలా ఉంటారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొనగా దానికి ముసుగులు తొలిగిపోయాయి. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సస్పెన్స్ కు అనీషా తెరదించింది. విశాల్ తో దిగిన ఫొటోను విడుదల చేసిన అనీషా, త్వరలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనీషా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన అనీషా ఎవరో కాదండోయ్ అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాల్లో నటించింది. పెళ్లి చూపులు సినిమాలో విజయ్ గర్ల్ ఫ్రెండ్ గా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఇప్పుడు సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.