రిచా కూడా ఫిక్స్ అయిపొయింది !

ప్రముఖ నటి రిచా గంగోపాధ్యాయ నిశ్చితార్థం జరిగిపోయింది. ప్రియుడితో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగిపోగా ఆ ఈ విషయాన్ని రిచా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. శేఖర్ ఖమ్ముల తెరకెక్కించిన ‘లీడర్’ మూవీలో రానా దగ్గుబాటితో జతకట్టి టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చారు రిచా. అనంతరం మిరపకాయ్, సారొచ్చారు, నాగవల్లి, మిర్చి సినిమాల్లో నటించారు. రెండేళ్లుగా ప్రేమిస్తున్న జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగిందని రిచా గంగోపాధ్యాయ తెలిపింది. తాను చదువుకున్న బిజినెస్ స్కూలులో రెండేళ్ల క్రితం జోయ్ తో తనకు పరిచయం ఏర్పడిందని రిచా పేర్కొంది. పెళ్లి తేదీ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. తనకు తిరిగి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని కొన్ని నెలల కిందట స్పష్టం చేసిన రిచా విదేశాలకు వెళ్లి బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేశారు. ఈ క్రమంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ జో లాంగెల్లాతో నిశ్చితార్థం చేసుకున్నారు. కాబోయే భర్త ‘జో’తో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. నటి రిచా తెలుగుతో పాటు తమిళం, బెంగాళీ మూవీల్లోనూ నటించి మెప్పించారు. అయితే సెకండ్ హీరోయిన్‌గా ముద్రపడటం, ఆఫర్లు తగ్గడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాను సినిమాల్లోకి మళ్లీ రానని, కేవలం వ్యక్తిగత జీవితంపైనే దృష్టి సారించినట్లు ఎంబీఏ చేస్తున్న సమయంలోనే రిచా తెలిపారు.