తమ్ముడు ఎంట్రీకి రంగం సిద్దం

Another-Daggubati-Hero-abhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ సర్వ సాధారణం అయ్యింది. నెలకు ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అయితే వారసుల్లో కొద్ది మంది మాత్రమే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారు. దగ్గుబాటి వారి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా మెల్ల మెల్లగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల జాబితాలో చేరిపోతున్నాడు. భల్లాలదేవుడు పాత్రలో రానా నటించిన తీరు, కనబర్చిన ప్రతిభతో రానా స్థాయి అమాంతం పెరిగి పోయింది. రానా తమ్ముడు అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయన ఇప్పటికే యాక్టింగ్‌ క్లాస్‌లకు కూడా హాజరు అయ్యాడు.

abhiram movie Coming soon

ఒకటి రెండు సినిమాలకు సహాయ దర్శకుడిగా, సహ నిర్మాతగా వ్యవహరించిన అభిరామ్‌ వచ్చే సంవత్సరంలో హీరోగా పరిచయం అవ్వడం ఖాయం అయ్యింది. ‘లేడీస్‌ టైలర్‌’ చిత్రంతో అభిరామ్‌ను హీరోగా పరిచయం చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మిస్‌ అయ్యింది. తాజాగా సురేష్‌ ప్రొడక్షన్స్‌లో అభిరామ్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భాను శంకర్‌ దర్శకత్వంలో సురేష్‌బాబు నిర్మాణంలో అభిరామ్‌ హీరోగా పరిచయం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా అభిరామ్‌ మొదటి సినిమా ఉంటుందని సురేష్‌ ప్రొడక్షన్స్‌ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అన్న స్టార్‌గా మారేందుకు పది సంవత్సరాలు పట్టింది. మరి తప్పుడు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చుకోలేస్తాడా, అసు అభిరామ్‌కు ఆ సత్తా ఉందా అనేది తేలాలి అంటే మరికొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే.