ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ పవర్ ఫుల్.

NTR Trivikram movie title Athade Oka Sainyam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ గురించి ఫిలిం నగర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ సినిమాకు ముందుగా ప్రచారంలోకి వచ్చిన అజ్ఞాతవాసి టైటిల్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా విషయంలో మాత్రం ఓ పవర్ ఫుల్ పేరు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఈ సినిమాకు సోల్జర్ అనే పేరు పెట్టొచ్చని అనుకున్నారు. కానీ ఆ టైటిల్ కన్నా పవర్ ఫుల్ టైటిల్ త్రివిక్రమ్ మదిలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు అంటున్నారు.

వారు చెబుతున్న దాని ప్రకారం “అతడే ఒక సైన్యం “ అనే టైటిల్ ని త్రివిక్రమ్ సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ కధకు టైటిల్ యాప్ట్ గా ఉండటం ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ ఫాన్స్ కోరుకునే పవర్ ఫుల్ పేరు కూడా కలిసి వస్తుంది అనుకుంటున్నారట త్రివిక్రమ్. టైటిల్ పూర్తి బాధ్యతను త్రివిక్రమ్ మీదే పెట్టిన ఎన్టీఆర్ మాత్రం డైరెక్టర్ ఏ పేరు ఫిక్స్ చేస్తాడా అని ఓ ప్రేక్షకుడిలా ఎదురు చూస్తున్నారట.