మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించిన ‘హౌరాబ్రిడ్జ్‌’

cine industry talks about howrah bridge movie song chinna naa nestham song

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌరా బ్రిడ్జ్‌’. ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే రాధా గోపాల అనే పాటను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. హరిప్రియ పాడిన ఆ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా టీజర్‌లతో పాటు పాట కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు తాజాగా విడుదలైన మరో పాట సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తుంది.

Rahul-Ravindran

చిన్న నాటి నా స్నేహం అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. శేఖర్‌ చంద్ర స్వరపర్చిన ఈ పాటను శ్రావణ భార్గవి పాడటం జరిగింది. హీరోయిన్‌ తన భావాలను పంచుకునే పాటగా ఈ పాట లిరిక్స్‌ ద్వారా తెలుస్తోంది. భాగ్యలక్ష్మి రాసిన ఈ పాటనుకు శ్రావణ భార్గవి వాయిస్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమా స్థాయిని పెంచే విధంగా ఈ చిత్రం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా పాట బాగుందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. మొత్తానికి చిన్న నాటి నా స్నేహం అనే పాటతో మళ్లీ అందరి దృష్టిని ‘హౌరాబ్రిడ్జ్‌’ ఆకర్షిస్తుంది.