అఖిల్‌ను కలవర పెడుతున్న నాని

Box Office War Between Akhil Hello and Nani MCA

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అఖిల్‌ అక్కినేని రెండవ చిత్రం ‘హలో’ విడుదలకు సిద్దం అవుతుంది. క్రిస్మస్‌ సందర్బంగా ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. మొదటి సినిమా ‘అఖిల్‌’ ఫ్లాప్‌ అవ్వడంతో తీవ్రంగా నిరాశ చెందిన అఖిల్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని చాలా కథలు విని చివరకు మనం దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌పై నమ్మకంతో ఈ చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటుంది. తాజాగా టీజర్‌ మరియు ట్రైలర్‌లు విడుదల అయ్యాయి. దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ వల్ల ‘హలో’ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక టీజర్‌, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అన్ని బాగానే ఉన్నా అఖిల్‌ను నాని భయం వెంటాడుతుంది.

‘హలో’ చిత్రం విడుదలకు ఒక్క రోజు ముందు నాని ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. నాని వరుసగా సక్సెస్‌లు అందుకోవడంతో పాటు ఈ చిత్రంలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటించడం, దిల్‌రాజు నిర్మించడం వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ‘హలో’ సినిమా బడ్జెట్‌లో సగం కూడా ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’కి ఖర్చు చేసింది లేదు. అయినా కూడా నాని చిత్రానికి హలో చిత్రం కంటే ఎక్కువ క్రేజ్‌ ఉంది.

ఒక్క రోజు ముందు విడుదల కాబోతున్న ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తే ‘హలో’ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోరేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే నాని చిత్రాన్ని అడ్డుకునేందుకు అక్కినేని వారు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. కాని దిల్‌రాజు పట్టుబట్టి మరీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘ఎంసీఏ’ టీజర్‌ యూత్‌లో విపరీతమైన ఆసక్తిని పెంచేసింది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. హలో సినిమా టాక్‌ కాస్త అటు ఇటు అయితే ‘ఎంసీఏ’ కుమ్మేయడం ఖాయం అని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.