హౌరాబ్రిడ్జ్‌… టైటిల్‌తోనే ఆకర్షణ

Howrah Bridge Movie success with Title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశంలో హౌరాబ్రిడ్జ్‌కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఆ బ్రిడ్జ్‌ పేరు టైటిల్‌గా తెరకెక్కిన చిత్రం అనగానే అందరి దృష్టి ఈ చిత్రంపై పడుతుంది. రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరిల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హౌరాబ్రిడ్జ్‌’ విడుదలకు సిద్దం అయ్యింది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని యూత్‌ ఆడియన్స్‌ ఎదురు చూసేలా ఈ చిత్రంకు పబ్లిసిటీ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లు మరియు టీజర్‌లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. యాదు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని ట్రైలర్‌ ద్వారా తేలిపోయింది.

ఆడియోకు కూడా మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో సినిమా విడుదల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. విభిన్న టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని దర్శకుడు యాదు చెబుతున్నాడు. ఈ చిత్రంలోని హీరో, హీరోయిన్‌ ప్రేమ కథకు హౌరాబ్రిడ్జ్‌తో సంబంధం ఉంటుంది. కథలో బ్రిడ్జ్‌ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందుకే హౌరాబ్రిడ్జ్‌ అనే టైటిల్‌ను పెట్టినట్లుగా చెబుతున్నారు. సినిమా విడుదలై చూసిన తర్వాత అంతా కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు అంటూ దర్శకుడు యాదు పేర్కొన్నాడు. హౌరాబ్రిడ్జ్‌లో రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరిలు చేసే లవ్‌ రొమాన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.