6 కోట్ల సినిమాకు 3 కోట్ల పబ్లిసిటీ

Naga Shourya Chalo Movie budget details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాగశౌర్య హీరోగా రష్మిక హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛలో’. నాగశౌర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌ సుమారు 6 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ మద్య కాలంలో సినిమాను తెరకెక్కించడం కంటే ఆ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లడం కష్టంగా ఉంది. ఆరు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఛలో’ చిత్రాన్ని ఏకంగా మూడు కోట్లతో ప్రమోషన్‌ చేశారు. ఫిబ్రవరి 2న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి రెండు నెలలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ట్రైలర్‌ ప్రదర్శణ, హెర్డింగ్‌లు ఇంకా పలు రకాల మాద్యమాల ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు.

నాగశౌర్య మార్కెట్‌ దృష్ట్యా ఆయన చిత్రానికి కేవలం 5 కోట్లు మించి పెట్టినట్లయితే అది మరీ ఎక్కువ. కాని ఈ చిత్రంకు ఏకంగా 9 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. నాగశౌర్య తల్లి ఉషా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించిన నేపథ్యంలో భారీ ఎత్తున ఖర్చు పెట్టింది. సొంత బ్యానర్‌ అవ్వడంతో నాగశౌర్య మార్కెట్‌ను పరిధిలోకి తీసుకోకుండా భారీ పబ్లిసిటీ ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంతో అయినా నాగశౌర్యకు హీరోగా స్టార్‌డం వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలు చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్న నాగశౌర్య కమర్షియల్‌ హీరోగా మాత్రం గుర్తింపు దక్కించుకోవడంలో విఫలం అవుతున్నాడు.