యూత్‌ ఎదురు చూస్తున్న ‘హౌరాబ్రిడ్జ్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

howrah-bridge-movie-release-date-fixed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో రూపొందిన ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రం కోసం యూత్‌ ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలు చిత్రాలతో యువతను ఆకట్టుకున్న రాహుల్‌ రవీంద్రన్‌తో పాటు యూట్యూబ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఛాందిన చౌదరి కలిసి ఈ చిత్రంలో నటించడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. దానికి తోడు ఈ చిత్రం నుండి వచ్చిన పాటలు మరియు టీజర్‌, ట్రైలర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచేలా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరిల రొమాన్స్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

howrah bridge Releasing on Jan 26th

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘హౌరా బ్రిడ్జ్‌’ చిత్రం విడుదల తేదీపై ఒక క్లారిటీ వచ్చింది. రిపబ్లిక్‌ డే సందర్బంగా చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని వర్గాల వారు చూడదగ్గ చిత్రం, రాహుల్‌ రవీంద్రన్‌తో పాటు, హీరోయిన్‌ ఛాందిని చౌదరి స్థాయి పెంచే చిత్రం ఇది అంటూ దర్శకుడు యాదు చెప్పుకొచ్చారు. అన్ని రకాల ఎమోషన్స్‌తో, ఒక క్యూట్‌ లవ్‌స్టోరీని మరింత క్యూట్‌గా దర్శకుడు యాదు తెరకెక్కించిన తీరుతో ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ను పొందుతారు అంటూ నిర్మాత పేర్కొన్నారు.