‘హౌరాబ్రిడ్జ్‌’పై సినీ ప్రముఖుల ఆసక్తి

Cinema Higher Officials Interested in Howrah Bridge

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో తెరకెక్కిన ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఒక చక్కటి ప్రేమ కథను ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడిచ్చి దర్శకుడు తెరకెక్కించాడు. ఈ చిత్ర ట్రైలర్‌ మరియు ఆడియో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. యూత్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ సింగర్‌ చిన్మయి భర్త అయిన రాహుల్‌ రవీంద్రన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన పూర్తి స్థాయి హీరోగా చేసిన తెలుగు సినిమా అవ్వడంతో ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

యూట్యూబ్‌లో స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న ఛాందిని చౌదరి కూడా ఈ చిత్రంతో పూర్తి స్థాయి కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. రాహుల్‌ రవీంద్రన్‌ మరియు ఛాందిని చౌదరిలకు ఇది చాలా కీలకమైన మూవీ అని చెప్పుకోవచ్చు. సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం ఎలా ఉంది, రాహుల్‌ ఎలా చేశాడు అంటూ సినీ వర్గాల వారు ఈ చిత్రంపై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకుడు యాదుకు మంచి ఆఫర్లు వస్తాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రం ప్రేక్షకుల మరియు సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తుంది.