విడుదలకు ముస్తాభవుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘హౌరాబ్రిడ్జ్‌’

howrah bridge movie release on december

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘హౌరాబ్రిడ్జ్‌’. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ షూటింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను డిసెంబర్‌లో విడుదల చేస్తామంటూ దర్శకుడు యాదు చెప్పుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్‌లు మరియు పోస్టర్‌లు సినిమాపై యూత్‌ ఆడియన్స్‌లో అంచనాలను అమాంతం పెంచేయగా, తాజాగా విడుదలైన రాదా గోపాల సాంగ్‌ సినీ వర్గాల్లో సైతం ఆసక్తిని కలిగిస్తుంది.

టీజర్‌ మరియు విడుదలైన పాట సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉండటంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని, సినిమా మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని దర్శకుడు యాదు చెబుతున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌కు హీరోగా, ఛాందిని చౌదరికి హీరోయిన్‌గా బ్రేక్‌ రావడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వీరిద్దరి మద్య ఉండే ఆరోగ్యకరమైన రొమాంటిక్‌ సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, కొత్త తరహా ప్రేమ కథను దర్శకుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.