‘హౌరాబ్రిడ్జ్‌’లో కామెడీ అదుర్స్‌

actor-rao-ramesh-about-howrah-bridge-movie-comedy-scenes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు ప్రేక్షకులకు పలు చిత్రాల ద్వారా సుపరిచితుడు అయిన రాహుల్‌ రవీంద్రన్‌ మరియు యూట్యూబ్‌ ప్రిన్సెస్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఛాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘హౌరా బ్రిడ్జ్‌’. ఈ చిత్రంకు సంబంధించిన రెండు టీజర్‌లు ఇప్పటికే విడుదలై సినిమాపై ఆసక్తిని కలిగించి, అంచనాలను పెంచేశాయి.హీరో హీరోయిన్‌ల మద్య లవ్‌ మరియు రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే డ్రామా ఈ చిత్రంలో ఉంటుందని దర్శకుడు యాదు చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఈ సినిమాలో యూత్‌ ఆడియన్స్‌కు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని, ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆ కామెడీ సీన్స్‌ ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

‘హౌరాబ్రిడ్జ్‌’లో కామెడీ అదుర్స్‌ - Telugu Bullet

నటుడు రావు రమేష్‌ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఒక మంచి పాత్ర చేశాను అని చెప్పే కంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ చిత్రం ద్వారా తాను ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు. సినిమాలో కామెడీ కోసం స్పెషల్‌గా ట్రాక్‌ లేక పోయినా, వల్గర్‌గా కామెడీ చేసే కమెడియన్స్‌ లేకపోయినా మెయిన్‌ కథలో వచ్చే పాత్రలతోనే దర్శకుడు యాదు చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు స్క్రీన్‌ప్లేను విభిన్నంగా నడిపించడం జరిగింది. కథలో భాగంగా కామెడీ సీన్స్‌ ఉండటం వ్ల ప్రేక్షకులు విసుక్కోకుండా, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్‌ అవుతారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రాహుల్‌ రవీంద్రన్‌ మరియు ఛాందిని చౌదరిల కెరీర్‌లో కీలకంగా మారబోతుందని, దర్శకుడు యాదుకు ఈ చిత్రం తర్వాత మంచి ఆఫర్లు వస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాతలు పేర్కొన్నారు.