‘హౌరాబ్రిడ్జ్‌’ ప్రివ్యూ

Howrah Bridge Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    రాహుల్ రవీంద్రన్, చాందిని చౌదరి 
నిర్మాతలు :     మాండవ నాగేశ్వరరావు, వడ్డేపల్లి శ్రీనివాస్, నల్లి కిరణ్ కుమార్ 
దర్శకత్వం :   రేవన్ యాదు 
ఎడిటర్ :    కోటగిరి వెంకటేశ్వరరావు 
మ్యూజిక్ :   శేఖర్ చంద్ర 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో రూపొందిన ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు అంటే ఫిబ్రవరి 3వ తారీకున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై మొదటి నుండి కూడా సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. విభిన్నమైన టైటిల్‌తో పాటు ఆకట్టుకునే టీజర్‌ మరియు ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు యాదు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న ఛాందిని చౌదరి ఈ చిత్రంతో రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం ఖాయం అని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. 

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘హౌరాబ్రిడ్జ్‌’ చిత్రంలోని పాటలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. అన్ని పాటలు కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు, కథపై ఆసక్తిని కలిగించే విధంగా ఉన్నాయి. టీజర్‌ మరియు ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచడంలో కీలకంగా వ్యవహరించాయి. ఇక చిత్ర యూనిట్‌ సభ్యులు భారీగా పబ్లిసిటీ చేయడంతో అన్ని వర్గాల వారికి కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలు భారీగా ఉన్న ఈ చిత్రం ఆకట్టుకుంటుందా అనేది రేపు విడుదల తర్వాత తేలిపోయే అవకాశం ఉంది.