మంచి పాత్ర అని ఒప్పుకుందట!

kalyani priyadarshan Next Movie with sharwanand
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రముఖ తమిళ దర్శకుడు ప్రియదర్శన్‌ కూతురు కళ్యాణి ప్రియదర్శన్‌ ‘హలో’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి చిత్రంతో టాలీవుడ్‌లో కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకోలేక పోయిన కళ్యాణి అవకాశాలు మాత్రం దక్కించుకుంటుంది. నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రముఖ దర్శకుడి కూతురు అవ్వడంతో తెలుగులో ఈమెకు పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు సినిమాలకు కమిట్‌ కాని కళ్యాణి తాజాగా శర్వానంద్‌ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు కమిట్‌ అయ్యింది. పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా కూడా కాదన్న కళ్యాణి తాజాగా శర్వానంద్‌కు ఓకే చెప్పడంతో అంతా అవాక్కవుతున్నారు.

స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినా కూడా కళ్యాణి చిన్న హీరో శర్వానంద్‌కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పడం ఏంటని ఆశ్చరోయపోతున్నారు. అయితే కళ్యాణి మాత్రం తనకు నచ్చిన కథ అవ్వడం వల్లే తాను శర్వానంద్‌తో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా పేర్కొంది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణి నటించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. తప్పకుండా ఈ సినిమాకు కళ్యాణి అదనపు ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనేందుకు కళ్యాణి సిద్దం అవుతుంది.