ఎన్టీఆర్ కి చుక్కలు చూపిస్తున్న ఇందిరమ్మ.

Indira Gandhi Role in Balakrishna NTR Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
దేశమంతా కాంగ్రెస్ గాలి వీస్తున్నప్పుడు ఆ పార్టీకి ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఎన్టీఆర్. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, దేశ ప్రధానిగా శక్తివంతం అయిన ఇందిరమ్మను దీటుగా ఎదుర్కొన్న మొనగాడు ఎన్టీఆర్. 1984 లో నాదెండ్ల వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్ వెనుక జనం ఏ స్థాయిలో వున్నారో ఇందిరకు బాగా అర్ధం అయ్యింది. అందుకే ఆ ఎపిసోడ్ ని ఆమె గానీ కాంగ్రెస్ కానీ ఎన్నడూ ఓన్ చేసుకోడానికి ధైర్యం చేయలేదు. అలాంటి ఇందిరమ్మతో ఇప్పుడు ఎన్టీఆర్ కి పనిపడింది. ఆ ఇద్దరూ స్వర్గస్థులు అయినప్పటికీ వాళ్ళ జ్ఞాపకాలు తెలుగోడి మదిలో అలా నిలిచిపోయే వున్నాయి. అందుకే తాజాగా బాలయ్య చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఇందిరమ్మ పాత్ర కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో ఇందిరాగాంధీ పాత్ర పెట్టాలి అనుకున్నప్పుడు హీరో బాలయ్య దర్శకుడు తేజ భలే ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. అయితే లోతుల్లోకి వెళితే గానీ అసలు ఇబ్బంది అర్ధం కాలేదు. ఇందిరమ్మ పాత్ర ఎలా చూపించాలి ?. ఆ పాత్ర కోసం ఏ నటిని తీసుకోవాలి అన్న విషయంలో చాలా కసరత్తు అవసరం అవుతోందట. అయినా ఇంత కసరత్తు చేసినా ఎక్కడో చోట విమర్శలు రాకుండా ఉంటాయా? అందుకే చిత్ర యూనిట్ ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చిందట. ఇందిరమ్మ పాత్రను కుదించి రెండు నిమిషాలకే పరిమితం చేయాలి అనుకుంటున్నారట. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఓపెనింగ్ సీన్ లో ఆమె వుండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి బతికున్నప్పుడు ఇందిరమ్మ ను దీటుగా ఎదుర్కొన్న ఎన్టీఆర్ కి తన బయోపిక్ దగ్గరకు వచ్చేసరికి చుక్కలు చూపిస్తోంది ఇందిరమ్మ.