రంగస్థలంలో తన పాత్రపై అనసూయ క్లారిటీ

Anasuya clarity about her Role in Ram Charan Rangasthalam 1985 Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటిస్తున్న విషయం తెల్సిందే. మార్చి చివరి వారంలో విడుదలకు సిద్దం అవుతున్న రంగస్థలంలో హాట్‌ యాంకర్‌ అనసూయ ఒక కీలక పాత్ర పోషిస్తుందనే విషయం అందరికి తెల్సిందే. నిన్న మొన్నటి వరకు రామ్‌ చరణ్‌కు మేనత్తగా అనసూయ కనిపించబోతుంది అంటూ మీడియాలో ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఆ విషయాన్ని అనధికారికంగా దృవీకరించారు. కాని తాజాగా అనసూయ ట్విట్టర్‌ ద్వారా ఆ విషయాన్ని కొట్టి పారేసింది.

తాజాగా ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ చేసిన అనసూయను ఒక ఫ్యాన్‌ మీరు రంగస్థలంలో చరణ్‌కు అత్తగా నటిస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా అనసూయ నిజం కాదు అంది. అనసూయ పాత్ర ఏంటీ అనే విషయంపై గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. ‘రంగస్థలం’ చిత్రం ఒక పల్లెటూరు బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతుంది. పల్లెటూరులో ఎన్నో చిత్ర విచిత్రమైన క్యారెక్టర్స్‌ ఉంటాయి. అందులో ఒక పాత్రను అనసూయ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రామ్‌ చరణ్‌కు బందువుగా లేదా సమంతకు బందువుగా అనసూయ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రంతో తనకు మంచి క్రేజ్‌ రావడం ఖాయం అని అనసూయ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి ఆమె కోరుకున్నట్లుగా రంగస్థలంతో సోలో హీరోయిన్‌ అవకాశాలు వస్తాయేమో చూడాలి.