మళ్లీ ఒక్కటవ్వాలనుకుంటున్న బాలీవుడ్‌ జంట

Hrithik roshan is married to his ex-wife sussanne khan again

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మరియు ఆయన భార్య సుసాన్నే కొన్ని విభేదాల కారణంగా 2014లో విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. వారిద్దరు విడాకులు తీసుకున్న సమయంలో విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి. సుసాన్నేతో విడాకులు తర్వాత హృతిక్‌ రోషన్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు అని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక ముంబయి మోడల్‌తో హృతిక్‌ డేటింగ్‌ చేస్తున్నాడని, ఆమెతో హృతిక్‌ ప్రేమలో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. త్వరలోనే హృతిక్‌ రోషన్‌ ఆమెను వివాహం చేసుకుంటాడు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తన మాజీ భార్యను హృతిక్‌ మళ్లీ పెళ్లి చేసుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్న హృతిక్‌ రోషన్‌ మరియు సుసాన్నే’ 2014లో విడాకులు తీసుకోవడం జరిగింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. విడాకుల సమయంలో పిల్లల ఆలనా పాలనను తాను కూడా చూసుకుంటాను అంటూ హృతిక్‌ రోషన్‌ కోర్టులో చెప్పుకొచ్చాడు. విడాకుల తర్వాత పిల్లల కోసం ఇద్దరు అప్పుడప్పుడు కలవడంతో విభేదాలు తొలగిపోయాయి. ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించిన నేపథ్యంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. తాజాగా హృతిక్‌ పుట్టిన రోజు సందర్బంగా సుసాన్నే ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌లో తన జీవితంకు ఎప్పుడూ హృతిక్‌ మెగుడు అని, ఆ వెలుగు నవ్వుతూ ఉండాలని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్‌తో ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ వ్యవహారం సాగుతుందని, ఇద్దరు మళ్లీ కలవడం ఖాయం అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు చెబుతున్నారు