‘హౌరాబ్రిడ్జ్‌’ నుండి మరో పాట

Howrah Bridge movie Chinnanati Naa Nestham Song release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌరాబ్రిడ్జ్‌’. ఈచిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం పాటలను ఒక్కొక్కటి చొప్పున విడుదల చేయడ జరుగుతుంది. ఇటీవలే రాధా గోపాల అంటూ ఒక పాటను విడుదల చేయడం జరిగింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఆ పాట ఉంది. ఇక తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

howrah-Bridge

‘చిన్న నాటి నా స్నేహం’ అటూ సాగే పాటను నిన్న సాయంత్రం విడుదల చేయడం జరిగింది. మొదటి పాట తరహాలోనే ఈ పాట కూడా చాలా చక్కగా సినిమాకు ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయడం జరుగింది. శ్రావణ భార్గవి పాడిన ఈ పాట తప్పకుండా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని దర్శకుడు యాదు చెప్పుకొచ్చారు.

Chinnanati-Naa-Nestham-Song

కథానుగుణంగా ఈ పాటలో భావం ఉంటుందని అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ పాటను అమితంగా ఇష్టపడుతారు అనే నమ్మకం ఉందని యాదు పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన పాటలు కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలి ఉన్న బ్యాలన్స్‌ షూటింగ్‌ను కూడా త్వరత్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్స్‌ చేస్తున్నారు.