‘హలో’ టీజర్‌ డిలీట్‌ వెనుక అసలు కారణం

Hello teaser removed from youtube due to copyrights

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అఖిల్‌ అక్కినేని రెండవ చిత్రం ‘హలో’ విడుదలకు సిద్దం అవుతుంది. వచ్చే నెలలో క్రిస్మస్‌ సందర్బంగా సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. షూటింగ్‌ పూర్తి అయిన ఈ సినిమాకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నాయి. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ సభ్యులు టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. టీజర్‌కు మంచి మార్కులు దక్కాయి. సినిమాపై అంచనాలు పెంచేలా టీజర్‌ ఉండి ఆకట్టుకుంది. తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను టీజర్‌ కల్పించింది. టీజర్‌లో అఖిల్‌ లుక్‌ మరియు హీరోయిన్‌ ఆకట్టుకున్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో యూనిట్‌ సభ్యులకు షాక్‌ తగిలింది.

Hello-Teaser

‘హలో’ మూవీ టీజర్‌ కోసం వాడిన ట్యూన్‌ కాపీ చేసిందని యూట్యూట్‌ తేల్చింది. కాపీ రైట్‌ క్లైమ్‌ అవ్వడంతో యూట్యూబ్‌ నుండి ‘హలో’ టీజర్‌ను డిలీట్‌ చేయడం జరిగింది. యూట్యూబ్‌ క్లారిటీగా ట్యూన్‌ను కాపీ చేయడం వల్ల డిలీట్‌ చేసినట్లుగా ప్రకటించింది. తెలుగులో ఎంతో మంది సంగీత దర్శకులు కాపీ చేశారు. కాని అనూప్‌ రూబెన్స్‌ ‘హలో’ చిత్రం కోసం ఎపిక్‌ నార్త్‌ అనే కంపెనీ వారు చేసిన ట్యూన్‌ను ఉన్నది ఉన్నట్లుగా వాడేశాడు. వారికి ఎలాంటి చెల్లింపులు చేయకుండా అనూప్‌ ఆ ట్యూన్‌ను వాడటంతో సదరు సంస్థ వారు యూట్యూబ్‌లో కాపీ రైట్‌ను క్లైమ్‌ చేయడం జరిగింది. దాంతో యూట్యూబ్‌ నిర్థారించి వెంటనే కాపీ రైట్‌ కింద హలో టీజర్‌ను తొలగించినట్లుగా ప్రకటించింది.

అఖిల్‌ మొదటి సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఈ చిత్రంపై చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. అక్కినేని వారు కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా టీజర్‌ను యూట్యూబ్‌ నుండి తొలగించడంతో పరువు పోయింది. టీజర్‌ ట్యూన్‌ను కూడా కాపీ కొట్టే పరిస్థితిలో హలో సినిమా ఉందని, ఇక కథ, స్క్రీన్‌ప్లే ఇతరత్ర అన్ని కూడా కాపీ అయ్యి ఉంటాయి అంటూ కొందరు సోషల్‌ మీడియాలో జోకులు వేస్తున్నారు. మొత్తానికి అఖిల్‌ సినిమాకు ఇలా కాపీ రైట్‌ క్లైమ్‌ కావడం చాలా పెద్ద మైనస్‌ అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.