ఊపిరి పీల్చుకున్న అక్కినేని కుటుంబం…

Nani MCA movie review and Public talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని కుటుంబం నుండి అఖిల్‌ హీరోగా పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి చిత్రం ‘అఖిల్‌’తో డిజాస్టర్‌ను అక్కినేని అఖిల్‌ చవిచూశాడు. వినాయక్‌ చేతిలో పెడితే అఖిల్‌కు మాస్‌ ఇమేజ్‌ వస్తుందనే ఉద్దేశ్యంతో నాగార్జున మొదటి సినిమాను ఆయనకు అప్పగించాడు. అయితే అంచనాలు తలకిందులు అయ్యాయి. ఏమాత్రం ఆకట్టుకోలేని చిత్రాన్ని వినాయక్‌ తీశాడు. దాంతో అఖిల్‌తో పాటు నాగార్జున కూడా చాలా డిసపాయ్యింట్‌ అయ్యాడు. అక్కినేని ఫ్యాన్స్‌ కూడా చాలా నిరాశను వ్యక్తం చేశారు. అయితే అఖిల్‌ను ఎలాగైనా హీరోగా నిలిపేందుకు నాగార్జున కంకణం కట్టుకుని హలో చిత్రాన్ని స్వయంగా నిర్మించాడు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ‘హలో’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సమయంలోనే ‘హలో’కు పోటీగా ఎంసీఏ చిత్రం విడుదలవుతుందని నాగార్జున ఆందోళన పడ్డాడు. నాని ఇటీవల చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ‘ఎంసీఏ’ చిత్రం సక్సెస్‌ అయితే ‘హలో’పై ప్రభావం పడుతుందనే విషయం అందరికి తెల్సిందే. తాజాగా విడుదలైన ఎంసీఏ చిత్రం ఆశించిన రేంజ్‌లో ఆకట్టుకోలేక పోయిందనే టాక్‌ వస్తుంది. జస్ట్‌ ఓకే మూవీ అన్నట్లుగా ఈ చిత్రం ఉండటంతో ప్రస్తుతం అక్కినేని ఫ్యాన్స్‌ లోలోపల గుర్రం ఎక్కి స్వారీ చేసినంత సంతోషంగా ఉండి ఉంటారు అనేది అందరికి తెల్సిందే. ఇక అక్కినేని ఫ్యామిలీకి కూడా కాస్త రిలాక్స్‌ దొరికినట్లయ్యింది. మొత్తానికి ఎంసీఏ ఫలితం తారుమారు అవ్వడంతో హలో చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.