కాంగ్రెస్ కు మరో షాక్ !

Another Ex Minister Mukesh Goud & His Son Quits Congress party

హైదరాబాద్ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగలనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో మరికొంత మంది సీనియర్లు ఆయన దారిలో పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో మరికొంత మంది సీనియర్లు ఆయన దారిలో పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు చూస్తున్నారని మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌, ఆయన కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ రెడీ అవుతున్నారని నిన్నటి నుండి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన  తన కుమారుడుతో కలిసి త్వరలోనే కారెక్కేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.గతంలో మార్కెటింగ్ శాఖా మాంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ముఖేష్ గౌడ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య కేబినెట్‌లో ఆయన మంత్రిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన ఆయన ముఖేష్‌, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన క్రియాశీలక రాజకియాలకు దూరంగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదనే అసంతృప్తితో ముకేశ్ గౌడ్ ఉన్నారు. తన కుమారడు విక్రం కాల్పుల మిస్టరీ, ఆ తర్వాత నానా రకాల ప్రచారాలతో ముఖేష్‌ గౌడ్‌ ఓ రకంగా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు పూర్తి ఫాంలోకి వచ్చిన వీరిద్దరు టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాగా కీలకనేతలు రోజురోజుకు పార్టీ వీడుతుండటంతో ఉలిక్కి ప‌డ్డ కాంగ్రెస్ ముఖ్య నేత‌లు జానారెడ్డి నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు.