ఏపీ RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP Govt gave good news to AP RTC employees
AP Govt gave good news to AP RTC employees

ఏపీ RTC ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త అందింది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్ లను కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.

నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైం అలవెన్సులను ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తుండగా… ఇకపై జీతంతో పాటే ఇవ్వనుంది. 2017 PRC బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దశలవారీగా చెల్లించనుంది.

కాగా, పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వాదనలు సంబంధిత రాష్ట్ర హైకోర్టులోనే వినిపించాలని సూచించింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దాని నిర్మాణ వ్యయం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలంటూ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.