పరిటాల ఇంట్లో పెళ్ళిసందడి.

AP Minister paritala sunitha son sriram marriage fix

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

AP Minister Paritala Sunitha, Paritala Ravi Son Sriram marriage

దివంగత నేత పరిటాల రవి కుటుంబంలో ఓ శుభకార్యానికి రంగం సిద్ధం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. పరిటాల తనయుడు శ్రీరామ్ పెళ్లి కుదిరినట్టు తెలుస్తోంది. కొడుక్కి ఎన్నో సంబంధాలు వచ్చినా తన కుటుంబ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని నడుచుకునే అమ్మాయి కోసం పరిటాల సునీత బాగా అన్వేషించారట. అయితే ఆ అన్వేషణకి అనంతపురం జిల్లాలోనే శుభం కార్డు పడిందట. నార్పల మండలానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబంలో అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకోడానికి సునీత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. శ్రీరామ్ కూడా తల్లి ఓకే అంటే తాను కూడా ఓకే అనడంతో త్వరలో వివాహానికి సంబంధించిన మిగతా పనులు మొదలు కాబోతున్నట్టు తెలుస్తోంది.

త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న శ్రీరామ్ 2019 ఎన్నికల్లో అనంత జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధం అవుతున్నారు. రాజకీయాలు కొత్త కాకపోయినా నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు శ్రీరామ్.

మరిన్ని వార్తలు: