మంత్రి కేటీఆర్ కు ఐటి నోటీసులు ?

IT notices to Minister KTR?
IT notices to Minister KTR?

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) కు ఐటీ శాఖ నోటీసులు అందజేసింది. ఎన్నికల అఫిడబిట్ లో ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను అందజేయాలని 15 క్రింద నోటీసులు ఇచ్చింది ఐటీ. ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్ ఐటీకి వివరాలను ఇవ్వకపోవడంతో నిషేదం ఉంటుంది.

మంత్రి కేటీఆర్ కు ఐటీ శాఖ సెప్టెంబర్ 17 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది . ఐటీ శాఖ 157 కింద నోటీసులు అందజేసింది. ఇంతకు ముందు కూడా కేటీఆర్ కి మనీలాండరింగ్ కేసులో లీగల్ నోటీసులను పంపినట్టు సమాచారం. సుఖేష్ చంద్రశేఖర్ నోటీసుల్లో తనను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తాజాగా కేటీఆర్ కి నోటీసులు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేటీఆర్ అమెరికాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న రాఖీ పండుగకి కూడా భారత్ లో లేనట్టు సమాచారం. కేటీఆర్ ఈ నోటీసులపై ఏం స్పందిస్తారు ? ఏం మాట్లాడాతారు అనేది వేచి చూడాలి మరీ.