ఏపీలో ప్రయాణికులకు అలర్ట్

ఏపీలో ప్రయాణికులకు అలర్ట్

ఏపీలో ప్రయాణికులకు అలర్ట్. దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ స్పెషల్ బస్ సర్వీసుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. రెగ్యులర్ బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు. త్వరలో అన్ని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమలు చేస్తామని.. ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు.

డీజిల్ ధరల పెరుగుదలతో సంస్థపై భారం పెరిగిందన్నార ద్వారకా తిరుమలరావు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనా ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. విలీనం అనంతరం కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. నిర్వహణ వ్యయం తగ్గించేందుకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని.. సంస్థపై పడుతోన్న భారం, నష్టాలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచన లేదు అన్నారు.