అరవింద సమేత ప్రీ రిలీజ్ వేడుకకి రంగం సిద్ధం

aravinda sametha movie pre release event

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అరవింద సామెత టీజర్ ఇప్పటికే అన్ని రంగాల ప్రేక్షకులని అలరించింది. ఇప్పటికే చిత్రం లోని కొన్ని పాటలను విడుదల చెయ్యడం జరిగింది, థమన్ సమకూర్చిన ఈ బాణీలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఎన్టీఆర్ కథానాయకుడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని అనుకున్న విధంగా జరిగితే ఈ చిత్రంని అక్టోబర్ 11న విడుదల చెయ్యడానికి ఈ చిత్ర బృందం చేస్తుంది.

ntr and balakrishna

ఈ చిత్రం విడుదల దగ్గర పడుతున్న సందర్భం లో త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ వేడుకని గాంధీ జయంతి సందర్భం గా అక్టోబర్ 2వ తేదీని జరపాలని నిర్మాతలు చూస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి అధికార ప్రకటన త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఈ వేడుకని నిర్వహిస్తారని సమాచారం. అయితే ఈ వేడుకకి సంబంధించి ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది, అదేంటంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా వస్తారని అని అభిమానులు అంటున్నారు. కానీ ఈ విషయం పై ఇంకా ఒక క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక భారీగా కాకుండా చాల సింపుల్ గా కానిచ్చేద్దాం అని చిత్ర బృందం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర గురించి గోప్యం గా ఉంచారని తెలుస్తుంది. ప్రేక్షకులకి కి సర్ప్రైజ్ ఇవ్వాలని ఉద్దేశం తో నే ఇలా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ముఖ్య పాత్రని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Aravinda Sametha Creates Record in Pre Release Business

ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదల అయ్యి దానిలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులకి అద్భుతమైన స్పందన వొచ్చింది. అయితే ఈ చిత్ర ఆద్యంతం ఎన్టీఆర్ రాయలసీమ యాస లో మాట్లాడతారని తెలుస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సంగీతం సమకూరుస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈషా రెబ్బా , నాగబాబు , జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.