‘నా పేరు సూర్య’లో అర్జున్‌ పాత్ర ఏంటో తెలుసా?

Arjun Role in Naa peru Surya Naa Illu India

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య’ ( నా ఇల్లు ఇండియా అనేది టైటిల్‌కు క్యాప్షన్‌). ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌ ఇంపాక్ట్‌ వీడియోను విడుదల చేశారు. బన్నీ ఫస్ట్‌ ఇంపాక్ట్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు. అల్లు అర్జున్‌ పాత్ర ఏంటీ అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్న అల్లు అర్జున్‌కు తండ్రిగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటిస్తున్నాడు. ఇటీవలే నితిన్‌ ‘లై’ చిత్రంలో ఒక పవర్‌ ఫుల్‌ రోల్‌ను అర్జున్‌ పోషించాడు. కాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా కూడా అర్జున్‌ నిరాశ పడకుండా ఈ చిత్రంలో బన్నీకి తండ్రిగా నటించాడు.

ఒక పవర్‌ ఫుల్‌ పాత్రలో అర్జున్‌ కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అర్జున్‌కు కొన్ని యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉంటాయని సమాచారం అందుతుంది. ఒక ఫిజీషియన్‌గా అర్జున్‌ నటిస్తున్నాడని, అల్లు అర్జున్‌కు తండ్రిగా అర్జున్‌ సరిగ్గా సూట్‌ అయ్యాడు అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఎన్నో చిత్రాలకు రచన సహకారం అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది.

ఇక బన్నీ మొదటి సారి ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నందున మెగా ఫ్యాన్స్‌ చాలా అంచనాలు పెంచుకున్నారు. బన్నీకి జోడీగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి లేదా మార్చిలో చిత్రీకరణ పూర్తి చేసుకోబోతుంది. ఏప్రిల్‌లో సమ్మర్‌ కానుకగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. బన్నీ కెరీర్‌లో నిలిచిపోయే సినిమాలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత ధీమాగా ఉన్నాడు.