మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి గురించి ప్రేక్షకుల స్పందన

Audience response to the middle class abbayi movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాని, సాయి పల్లవి జంటగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చాలా అంచనాలు పెట్టుకుని ఈ చిత్రాన్ని దిల్‌రాజు విడుదల చేశాడు. తమ బ్యానర్‌లో ఈ చిత్రం డబుల్‌ హ్యాట్రిక్‌ అవ్వబోతుందనే నమ్మకం దిల్‌రాజులో కనిపించింది. అయితే కథ అడ్డం తిరిగింది. దిల్‌రాజు అనుకున్నట్లుగా సినిమా ఆశించిన స్థాయిలో లేదు అంటూ సినీ విశ్లేషకులు రివ్యూు ఇచ్చారు. సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో సినిమాపై బ్యాడ్‌ కామెంట్స్‌, బ్యాడ్‌ రివ్యూలు వచ్చాయి. అయితే ప్రేక్షకులు మాత్రం కాస్త పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. 

మొదటి రోజు నాలుగు ఆటలు చూసిన ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్‌ చూసినట్లయితే ‘ఎంసీఏ’ చిత్రం ఆశించిన స్థాయిలో లేదు అనే మాట వాస్తవమే. కాని మరీ దారుణంగా ఏమీ లేదని, నాని గత చిత్రాల స్థాయిలో ఉందని, చరణ్‌, పవన్‌ల రేంజ్‌లో నాని సినిమాను ఊహించుకున్న వారికి నిరాశ కలిగించక మానదు అంటున్నారు. 

ఎంసీఏపై ఎక్కువగా మీడియా వర్గాల వారు అంచనాలు పెట్టుకున్నారు. దాంతో సాదా సీదాగా ఉండటంతో విశ్లేషకులకు మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి నచ్చలేదు. అయితే ప్రేక్షకుల్లో మాత్రం ‘ఎంసీఏ’పై మొదటి నుండి కూడా సినిమా బాగుంటుందనే సింపుల్‌ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే సినిమా చూసిన వారికి సినిమా పర్వాలేదు బాగానే ఉంది అనిపిస్తుందని అంటున్నారు. మొత్తానికి ‘ఎంసీఏ’కు మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.