టీటీడీ సభ్యుడిగా దిల్ రాజు ?

Dil Raju to be a member of TTD

తెలుగు ఇండ‌స్ట్రీలో దిల్ రాజుకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్క‌సారి దిల్ రాజు క‌థ ఓకే చేసాడంటే ఆ సినిమాకు తిరుగుండ‌దు అనే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల సొంతం. ఈయ‌న‌కు సినిమాలపైనే కాదు దేవుడిపై కూడా చాలా న‌మ్మ‌కం ఉంది. ముఖ్యంగా వెంక‌టేశ్వ‌ర స్వామిని కొలుస్తాడు దిల్ రాజు. అందుకే ఆయ‌న సంస్థ‌కు కూడా వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అని పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి. దీనికి జ‌గ‌న్ కూడా స‌రే అన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ ఛైర్మ‌న్ ప‌దవిలో జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి నియ‌మితుడ‌య్యాడు. ఇప్ప‌టికే ఈయ‌న ప్ర‌మాణ స్వీకారం కూడా చేసాడు. దీనికి దిల్ రాజు కూడా వ‌చ్చాడు. అక్క‌డే చాలా సేపు ఉండి ఆయనతో ఏదో ముచ్చ‌టించాడు. ఇదే క్ర‌మంలోనే ఈయ‌నకు టీటీడిలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీని వెన‌క కూడా ఓ క‌థ ఉంది. దిల్ రాజును టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రిఫెరెన్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. నిజామాబాద్ జిల్లాకి చెందిన వెంకటరమణా రెడ్డి, సినిమా నిర్మాత దిల్ రాజు గా మారాడు.