టీజర్‌ రివ్యూ : అసలేంటీ ఈ ‘అ!’

Awe Teaser Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
హీరోగా వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. వాల్‌పోస్టర్‌ బ్యానర్‌లో ‘అ!’ అనే చిత్రాన్ని నాని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ‘అ!’ చిత్రంలో పలువురు టాలీవుడ్‌ స్టార్స్‌ నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి భారీ ఎత్తున ఉంది. ఇక తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో పాత్రలను పరిచయం మాత్రమే చేశారు. సినిమా కథ, కథనం ఏంటీ అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా టీజర్‌ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేసింది. రాజమౌళి టీజర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మొదటి నుండి ఆసక్తి రేపుతున్న ‘అ!’ చిత్రం టీజర్‌ కూడా అద్బుతంగా ఉంది అంటూ కామెంట్స్‌ చేశాడు.

కాజల్‌, నిత్యామీనన్‌, రెజీనా, అవసరాల శ్రీనివాస్‌, ప్రియదర్శి, ఇషా ఇంకా పలువురు స్టార్స్‌ నటించిన ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. సినిమాపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతూ ఉంది. ఇదో కామెడీ సినిమానా, లేక హర్రర్‌ సినిమానా లేదా సైన్స్‌ ఫిక్షన్‌ సినిమానా అనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. టీజర్‌లో కేవలం పాత్రలను చూపించడంతో అసలు ఈ సినిమా ఏంటీ అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది అంటూ నాని సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాని అనధికారికంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా సన్నిహితులతో చెప్పుకొచ్చాడు. నాని నిర్మాతగా కూడా సక్సెస్‌ అవుతాడు అంటూ కొందరు అంచనా వేస్తున్నారు.