పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ క్రీడాకారిణి

Baby Boy For Sania Mirza Shoaib Malik

స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానిమా మిర్జా 2010లో పాక్‌ క్రికెటర్‌ షోమెబ్‌ మాలిక్‌ను వివాహం చేసుకుంది. ఏనమిదేళ్ల క్రితం వివాహం అయిన సానియా పిల్లల కోసం గతకొంత కాలంగా టెన్నిస్‌కు దూరంగా ఉంటోంది. సానియా తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు షోయెబ్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. మీ అందరితో ఈ వార్త పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది, మీ అందరి ప్రేమాభిమానాల వల్ల నా భార్య మరియు బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు అంటూ తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నాడు.

Sania-Mirza

మొదటి బిడ్డ పుట్టిన సంతోషంలో షోయెబ్‌ ఉబ్బితబ్బిపోతున్నాడు. బిడ్డ పుట్టినందుకు గాను వీరి సన్నిహితులు సోషల్‌ మీడియా ద్వారా కంగ్రాట్స్‌ చెబుతున్నారు. సానియా 2020లో టోక్యోలో జరిగే ఒంపిక్స్‌లో పాల్గొనబోతున్నట్టుగా ఇదివరకే ప్రకటించారు. ఇక అప్పటి వరకు తన కుమారుడితో ఎంజాయ్‌ చేస్తుంది కాబోలు. షోయెబ్‌ తన బేబీకి మీర్టా మాలిక్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. బిడ్డ పుట్టినందుకు వీరి అభిమానులు చాలా ఖుషీగా ఫీల్‌ అవుతున్నారు.

Sania-Mirza-baby