నేను కాలా అంటూ ప్రకటించిన బాలీవుడ్ దర్శకురాలు

అవునండీ, మీరు విన్నది నిజమే. అలా అని కాలా అంటే సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన కాలా సినిమాలోని కాలా అనే పవర్ఫుల్ క్యారెక్టర్ అనుకునేరు. కాలా అంటే ఉర్దూ లో పిన్ని అని అర్ధం. ఇంతకీ ఆ బాలీవుడ్ దర్శకురాలు ఎవరు అనుకుంటున్నారా? ఓం శాంతి ఓం తో దీపికా పదుకునే ని బాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకురాలు ఫరా ఖాన్. ఆ తరువాత తీస్ మార్ ఖాన్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి హిట్ సినిమాలు కూడా తీసి, వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు.

నేను కాలా అంటూ ప్రకటించిన బాలీవుడ్ దర్శకురాలు - Telugu Bullet

అది సరే, ఇప్పుడు ఈ కాలా విషయం ఏమిటీ అనుకుంటున్నారా? ఈ లేడీ డైరెక్టర్ ఫరా ఖాన్ మరియు మన టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మాంచి ఫ్రెండ్స్. ఎంతలా అంటే జిగిరి దోస్త్స్ అనుకోండి. ఈరోజు పొద్దున 8. 20 కి సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్ దంపతులు ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తన ఫ్రెండ్ ఒక పండంటి బిడ్డకి తల్లైన విషయం తెలిసిన ఫరా ఖాన్ ఆనందానికి హద్దులు ఎంచగలమా? వెంటనే తను ట్విట్టర్లో ఒక ఫోటో ని పెడుతూ, తన సంతోషాన్ని అందరితో పంచుకుంది. నేను కాలా (నేను పిన్ని) అని ఆ క్యారికేచర్ ఫొటోలో ప్రకటించుకుంది. అదేమిటో మీరు కూడా చూడండి.