మారి-2 ఫస్ట్ లుక్ కి సిద్ధం అయిపోండి.

Maari 2 First look

తమిళ హీరో ధనుష్ నటించిన మాస్ సినిమా గుర్తుందా. యూట్యూబ్ లో అయితే ఆ సినిమా కొన్ని లక్షల వ్యూస్ తో ఇప్పటికీ దూసుకుపోతుంది. ఆ సినిమాకి అసలైన తమిళ మాతృక మారి సినిమా. 2015 లో విడుదలైన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, సింగర్ విజయ్ ఏసుదాస్ విలన్ గా నటించారు. ఇప్పుడు ఈ సినిమా యొక్క సెకండ్ పార్ట్ “మారి-2” అనే టైటిల్ తో రూపొందుతుంది. ఈ సీక్వెల్ తమిళం తో పాటు, తెలుగులో ఏకకాలంలో విడుదలయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి.

Sai pallavi in maari 2 movie

దానికి గల ముఖ్య కారణం ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేయడమే. తెలుగులో సాయి పల్లవి కి ఉన్న ఫాలోయింగ్ మనకు తెలియనిది కాదు. నాని సినిమాలకి ఎంత ఫాన్స్ ఉంటారో, సాయి పల్లవి సినిమాలకి కూడా అదే రేంజ్ లో ఫాన్స్ ఉంటారనేది కాదనలేని నిజం. ధనుష్ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళం హీరో టోవినో థామస్ విలన్ గా నటిస్తున్నాడు.

Dhanush-Maari

అంతే కాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ (శరత్ కుమార్ కూతురు, పందెం కోడి 2 ఫేమ్ ) ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. మారి సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, ఈ సీక్వెల్ కి మాత్రం యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని నవంబర్ 2 న విడుదల చేస్తున్నామని ఈ మూవీ టీం ట్విట్టర్ లో ప్రకటించింది. ఈ ఫస్ట్ లుక్ తెలుగులో కూడా విడుదల అవుతుందా అనే విషయం పైన ఇప్పటికి ఎటువంటి సమాచారం లేకపోయినా, ఆ తేదీలోపు ప్రకటిస్తారని భావించొచ్చు.

Maari-2-making