కేదార్ నాథ్ టీజర్ టాక్ – సైఫ్ కూతురు తొలి సినిమాతోనే ఆకట్టుకుంటుంది.

 

kedarnath Movie Trailer Talk

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించిన తొలిచిత్రం కేదార్ నాథ్. ఈ సినిమా ట్రైలర్ తాజా గా విడుదలయింది. ట్రైలర్ ని చూస్తే ఈ సినిమా 2013 లో ఉత్తరప్రదేశ్ లో, ముఖ్యంగా కేదార్ నాథ్ లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో ఒక అందమైన ప్రేమకథని చెప్పబోతున్నట్టుగా అర్ధం అవుతుంది.

ట్రైలర్ మొత్తం అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించిన గ్రాఫిక్స్ తో నిండి, అప్పటి వరద భీభత్సాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. వీటితో పాటు హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరియు సారా అలీ ఖాన్ మధ్యన కూడా ఒక అందమైన ప్రేమ కథ ని ఆహ్లాదకరంగా చూపించారు కొన్ని షాట్స్ లోనే.

Kedarnath-movie

ట్రైలర్ ని గమనిస్తే ఇదొక హిందూ హీరోయిన్, ముస్లిం హీరో మధ్య జరిగే ఒక ప్రేమకథగా తెలుస్తుంది. డైరెక్టర్ అభిషేక్ కపూర్ ఈ సినిమాని ఎంత బాగా చిత్రీకరించాడో ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఇట్టే అర్ధం అవుతుంది. హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ కి డైరెక్టర్ అభిషేక్ కపూర్ తో ఇది రెండో సినిమా (కై పో చే అనేది తొలి చిత్రం).

హితేష్ సోనిక్ అందించిన నేపధ్య సంగీతం కూడా ఈ ట్రైలర్ కి మరో ప్రత్యేక ఆకర్షణ. సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ ఈ సినిమాలో అందంగా కనిపించడమే కాకుండా, హీరోతో లిప్ లాక్ సీన్ కూడా చేసింది. ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.