కేసీర్‌ బయోపిక్‌ లో కేసీఆర్‌ ఎవరంటే?

Srikanth Acts In KCR's Biopic

ఇటీవల బయోపిక్‌ చిత్రాలకు ఆదరణ ఎక్కువయింది. దాంతో పలువురు దర్శక నిర్మాతలు ప్రముఖ బయోపిక్‌లు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రేక్షకుల దగ్గర నుండి కూడా బయోపిక్‌లకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు బయోపిక్‌ల చిత్రీకరణ జరుగుతుండగా తాజాగా మరో బయోపిక్‌కు కూడా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవిత చరిత్రతో బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ‘జై బోలో తెంగాణ’ ఫేం ఎన్‌ శంకర్‌ తెరకెక్కించనున్నారు. కేసీఆర్‌ పాత్రలో నటించడానికి మొదటగా ఒక బాలీవుడ్‌ నటున్ని సంప్రదించారు. కానీ ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు.

SRIKANTH

తాజాగా మీడియాతో ముచ్చటించిన శ్రీకాంత్‌ తాను కేసీర్‌ బయోపిక్‌లో నటించనున్నట్టుగా తెలిపారు. ‘తెలంగాణ దేవుడు’ పేరుతో ఈ చిత్రం రూపొందనుందని, కేసీఆర్‌ బాల్యం, విద్యాభ్యాసం, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ చురుకైన పాత్ర మొదలయినవి చూపించనున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే సాదారణ ఎన్నికల కంటే ముందే తీసుకువచ్చేలా చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ‘తెలంగాణ దేవుడు’ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. కాగా ప్రస్తుతం శ్రీకాంత్‌ కేసీఆర్‌ బాడీ లాంగ్వెజ్‌కు తగ్గట్టుగా మారేందుకు కసరత్తులు చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.