తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని కిడ్నాప్‌….

తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని కిడ్నాప్‌

ఆరుబయట తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు ఓ ఆగంతకుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని కనుగొన్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన మంగళవారం పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు…లూథియానాకు చెందిన ఓ కుటుంబం సోమవారం ఇంటి బయట నిద్రపోయేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తల్లితండ్రులతో పాటు వారి నాలుగేళ్ల చిన్నారి కూడా బయటే పడుకుంది.

ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత వారు నిద్రిస్తున్న ప్రదేశానికి చేరిన ఓ వ్యక్తి..చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని మెల్లిగా ఆమె నుంచి వేరు చేసి తన రిక్షాలో పడుకోబెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో చిన్నారి తల్లికి మెలకువ రావడంతో వెంటనే అతడి చేతుల్లో నుంచి బిడ్డను లాక్కొని కేకలు వేసింది. ఈ క్రమంలో ఆమె భర్త ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయాడు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా..అతడిని మంగళవారం అరెస్టు చేశారు. కాగా నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.