నటి నయనతార జీవితం లో ప్రత్యేకమైన రోజు

నటి నయనతార జీవితం లో ప్రత్యేకమైన రోజు
లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైనదట. ఎందుకంటే ఈరోజు తన ప్రియుడు, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నైలోని ఓ కెఫేలో ఘనంగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు నయన్. నయనతార చాలా ఆనందంగా ఉన్నారు. వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ధరణ్ కుమార్, యాంకర్ దివ్యదర్శిని, మేకప్ ఆర్టిస్ట్ ప్రకృతి అనంత్, మోడల్స్ సంయుత, ఆర్తి వెంకటేశ్, పూర్తి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.